సౌత్ ఇండియాలోని ప్రముఖ చిత్ర పరిశ్రమలలో ఒకటైన శాండిల్ వుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. డ్రగ్స్ ఆరోపణలపై హీరోయిన్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ పెడ్లర్స్ గా ఉన్న మరికొంత మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంజన గల్రానిపై విచారణ పోలీస్ అధికారులకు సవాలు విసురుతుంది. నిజానికి ఆమె డ్రగ్స్ వాడినట్లు కానీ, డ్రగ్స్ కొనుగోళ్లు అమ్మకాలు జరిపినట్లు కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదట.
ఆమె కాల్ డేటాతో పాటు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేసినా, ఆమె నేరం చేసినట్లు ఆధారాలు లభించలేదని తెలుస్తుంది. ఐతే సంజన గల్రాని ఆస్థి చూస్తే మాత్రం అధికారులకు మైండ్ పోతుంది. సంజన కోట్లు విలువ చేసే ఆస్తులు, డబ్బులు కూడబెట్టారని విచారణలో తేలింది. ఒక స్టార్ హీరోయిన్ కి మించిన సంపాదన ఆమె దగ్గర ఉందని అధికారులు గుర్తించారు. కానీ సంజన స్టార్ హీరోయిన్ కాదు కదా, కనీసం టూ టైర్ హీరోయిన్ రేంజ్ కూడా లేదు.
ఆమెకు సినిమాలలో సరైన అవకాశాలు లేవు. ఎప్పుడో సంజన ఫేడ్ అవుట్ కావడం జరిగింది. మరి అలాంటి సంజన దగ్గర ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా ఉన్నాయనే విషయంలో అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం సంజనను పరప్పన అగ్రహారం జైలులో ఉంచారు. మరో హీరోయిన్ రాగిణి ద్వివేది కూడా ఇదే జైలులో ఉన్నారు.