మంచి ఫామ్లో ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమాకి నాలుగేళ్లు కేటాయించారు. ఈ సాహసాన్ని చేసేటప్పుడు చాలామంది ఇతర సినిమాలు కూడా చేయమని సలహా ఇచ్చారు. కానీ యంగ్ రెబల్ స్టార్ భారీ ఆఫర్లు వచ్చినా చేయలేదు. అందుకు తగిన ప్రతిఫలం దక్కింది. అంతకు ముందు సినిమాకు ఐదు కోట్లు తీసుకుంటున్న ప్రభాస్.. బాహుబలి రెండు భాగాలకు కలిసి 75 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత సుజీత్, రాధా కృష్ణ డైరక్షన్లో సినిమాలు చేయనున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కనున్నాయి. వాటికీ కూడా ప్రభాస్ 30 కోట్లు (ఒక్కో సినిమాకి) పారితోషికం అందుకోనున్నారు. ఇలా బాహుబలి అన్నివిధాలుగా ప్రభాస్ రేంజ్ ని అమాంతం పెంచేసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.