పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తోంది

  • January 16, 2020 / 01:46 PM IST

ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంటున్నాయి.. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ గురించి వస్తున్న వార్తలు. “అజ్ణాతవాసి” అనంతరం రాజకీయాలతో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “పింక్” రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారని, దిల్ రాజుతో కలిసి బోణీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా వార్తలొచ్చాయి. ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించనున్నారని క్యాస్టింగ్ కూడా ఫిక్స్ చేసేశారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకూ ఈ ప్రొజెక్ట్ విషయంలో నోరు మెదపలేదు. అసలు ఈ ప్రొజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతుంటే.. పవన్ నటించబోయే మరో ప్రొజెక్ట్ అంటూ ఇప్పుడు మరో సినిమా వార్త హల్ చల్ చేయడం మొదలెట్టింది.

అదేమిటంటే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ పీరియాడిక్ డ్రామా సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో నటిస్తున్నాడని, ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారని నిన్నటినుండి అన్నీ వెబ్ సైట్స్ & సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ కానీ.. పవన్ బృందం కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇన్నేసి వార్తలు వస్తుండడం, వీటిపై పవన్ & టీం రెస్పాండ్ అవ్వకుండా అలా వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పవన్ తన రీఎంట్రీ గురించి ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుండు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus