Priyamani: స్నేహితునితో ప్రియమణి అఫైర్.. క్లారిటీ అప్పుడే..?

  • May 24, 2021 / 12:05 PM IST

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా ప్రియమణి నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో ఎక్కువగా నటించిన ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా నటిగా మళ్లీ బిజీ అవుతున్నారు. నారప్ప, విరాటపర్వం సినిమాల్లో ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో కూడా ప్రియమణి నటించారు.

అయితే ఈ వెబ్ సిరీస్ లో ప్రియమణి బోల్డ్ రోల్ లో నటించారని తెలుస్తోంది. ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్ పేయ్ భార్య సుచిత్ర రోల్ లో ప్రియమణి నటించారు. అయితే ఫ్యామిలీ మేన్ లో స్నేహితునితో ప్రియమణి అఫైర్ పెట్టుకున్నట్టు చూపించగా ఆమె నిజంగా అఫైర్ పెట్టుకున్నారో లేదో మాత్రం చూపించలేదు.. అయితే స్నేహితునితో ప్రియమణికి అఫైర్ ఉందో లేదో సీజన్ 2లో చూపించనున్నారు.

ప్రియమణి పాత్ర ప్రేక్షకుల్లో వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతుండటం గమనార్హం. ప్రియమణి బోల్డ్ రోల్స్ లో నటిస్తూ ఉండటంతో ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ఫ్యామిలీ మేన్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు సీనియర్ హీరోలకు ప్రియమణి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలకు, వెబ్ సిరీస్ లకు భారీ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus