షాకింగ్ – సుమా ఇది నిజమేనా!!!

  • March 11, 2016 / 07:16 AM IST

‘యాంకర్’గా  బుల్లి తెరని ఏలుతున్న ఎంతో మంది యాంకర్స్ లో సుమ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 23ఏళ్ల యాంకరింగ్ అనుభవం కలిగిన సుమ 600ల ఆడియో విడుదల కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘స్టార్ మహిళ’ కార్యక్రమాన్ని 2వేలకు పైగా ఎపిసోడ్స్ కు యాంకరింగ్ చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో సైతం స్థానం దక్కించుకుంది. అదే క్రమంలో పరిశ్రమలో ఒక టాప్ సెలెబ్రిటీ స్థానంలో ఉన్న ఆమె ఆరోగ్యంపై కొన్ని కధనాలు వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఆమె అభిమానులను షాక్ కు గురి చేశాయి…

వివరాల్లోకి వెళితే…సుమ గత కొన్ని రోజులుగా గొంతు సంబంధమైన ఇబ్బందితో బాధ పడుతున్నట్లు, ఆమె యాంకరింగ్ ఇలానే కొనసాగిస్తే  మరింత ఇబ్బందుల్లో చిక్కుకుని, పర్మినెంటుగా వాయిస్ లో మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆమెను హెచ్చరించినట్లు వెబ్ మీడియా కోడై కూస్తుంది. అంతేకాకుండా….ఆమె చెతున్న షోస్ లో ఒకానొక షోలో ఆమెపై ఆమెనే….సెటైర్ వేసుకుంటూ….విరామం లేకుండా యాంకరింగ్ చేయడం వల్ల తన గొంతు దెబ్బ తింటోంది జోక్ చేసింది. మరి ఆ వ్యాఖ్యలకు ఆధారంగా ఈ గాసిప్స్ పుట్టుకొచ్చాయా…లేదంటే నిజంగానే ఊహకు కూడా అందని వ్యాదితో సుమ బాధపడుతుందా అనేది అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా…ఇవన్నీ వదంతలుగా కొట్టుకుపోవాలని, ఆమె ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుందాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus