Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ రన్ టైం వెనుక అసలు కారణం అదేనట..!

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ ‘రావణాసుర’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘రావణాసుర’ ప్లాప్ అయ్యింది. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ అయినా అది పూర్తిగా చిరు అకౌంట్లో పడిపోయింది. అందుకే తన నెక్స్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ.దేశాన్ని గజగజలాడించిన స్టూవర్టుపురం దొంగ అయిన నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా రూపొందింది.

రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. అలాగే ‘కార్తికేయ 2’ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లు కొట్టిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాత.వంశీ ఈ చిత్రానికి దర్శకుడు.టీజర్, ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. కాబట్టి ‘టైగర్ నాగేశ్వరరావు’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే టీం మెంబర్స్ ని ఓ అంశం బాగా టెన్షన్ పెడుతుంది.అదేంటి అంటే..

ఈ మధ్యనే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. రన్ టైం ఏకంగా 3 : 0 : 39 సెకన్ల నిడివి కలిగి ఉందట. అంత రన్ టైం అంటే ప్రేక్షకులకి టెన్షన్ రావడం ఖాయం. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతల వద్ద ప్రశ్నిస్తే.. ” ‘టైగర్ నాగేశ్వరరావు’ కథని చూపించాలంటే గట్టిగా 4 , 5 గంటల టైం పడుతుంది. రెండు భాగాలుగా ఈ కథని ప్లాన్ చేయాలని అనుకున్నాం.

కానీ ఎక్కడ సగం సినిమా (Tiger Nageswara Rao) చూశామనే ఫీలింగ్ జనాలకి కలుగుతుందో అని భావించి 3 గంటల రన్ టైంని ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ‘మహానటి’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలు కూడా 3 గంటల పైనే నిడివి కలిగి ఉంటాయి. కానీ అవి కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ, విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus