దిశాను.. ఇలియానాతో పోలిస్తూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది దిశా పటానీ. ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో ఈమె సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూనే కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా దిశా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆమె గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం మొహమాటం పడదు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే కుర్రకారుకి బాగా తెలుసు. ఇటీవల దిశా.. ‘లాక్మే ఫ్యాషన్ వీక్ 2019’ లో మిరుమిట్లు గొలిపే మెరుపుల (షిమ్మరీ) డ్రెస్ లో దిశా ఇచ్చిన ఫోజులు హైలైట్ గా నిలిచాయి. యాష్ కలర్ డిజైనర్ డ్రెస్ .. బ్రౌన్ కలర్ హెయిర్ కాంబినేషన్లో దిశా లుక్ ఆకట్టుకుంటుంది.

ఆమె ఈ కార్యక్రమంలో ఇచ్చిన ఫోజులు అలాగే ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలియానా తర్వాత ఆ రేంజ్ ఫిజిక్ ఉన్నప్పటికీ ఎందుకో ఈమె టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. ప్రస్తుతం దిశా ఫోటోలు చూస్తున్న కుర్ర కారు కొందరు…. ‘ఇలియానా ఫీచర్స్ ఉండీ ఏం లాభం? తనంత స్థాయికి’ వెళ్ళలేకపోతున్నావ్’ అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అయితే గ్లామర్ పాత్రలు ఎంచుకుంటే ఆ స్థాయికి వెళ్ళగలరో లేదో కానీ సినిమాకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటే అది పెద్ద కష్టమేమికాదేమో.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus