సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమంటే.. ఇప్పటి రోజుల్లో షార్ట్ ఫిలిమ్స్ లేదా వెబ్ సిరీస్ లలో నటించి క్రేజ్ సంపాదించుకుంటే సరిపోతుంది. ఇది వరకు అయితే నాటకాలు వేసి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను మెప్పించాల్సి ఉండేది. అటు తరువాత మెల్ల మెల్లగా సినీమల్లోకి ఎంట్రీ ఇచ్చేవారు.ఒక్కసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన.. నిరంతరం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయా అంటే.. అది కచ్చితంగా చెప్పలేము. ఒక్కసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అంటే వాళ్ళు ఏదో ఒకరకంగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి.
లేదా ముందు నుండే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన నటీ నటులు ఎవరైనా తెలిసి ఉండాలి. అయితే సొంతంగా ఎదిగిన నటీనటులు కూడా చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్ లోకే వస్తారు మన పి.ఎల్.నారాయణ గారు. అప్పటి స్టార్ హీరోల అందరి సినిమాల్లోనూ ఈయన నటించారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈయన 300 కి పైగా సినిమాల్లో నటించారు. ఈయన రిఫరెన్స్ తోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందట హీరోయిన్ ఊహ. ఇప్పటి వరకూ ఈమె అందరికీ శ్రీకాంత్ భార్య గానే తెలుసు.
అయితే మొదట ఈమె పి.ఎల్.నారాయణ గారి మేనకోడలిగా ఎంట్రీ ఇచ్చిందట. ‘ఆమె’ చిత్రం ఊహకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందట.నిజానికి ఊహ అసలు పేరు శివరంజిని. కానీ ఆ చిత్రం దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ గారు ఈమె పేరుని ఊహగా మార్చారని తెలుస్తుంది.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?