అప్పటి హీరో హరీష్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు..!

  • May 4, 2022 / 12:44 PM IST

సినీ ఇండస్ట్రీలో ఉండేవారి టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. క్లాప్ బాయ్ దగ్గరనుండీ టాప్ స్టార్ల వరకూ వారి దశ ఎప్పుడైనా తిరగొచ్చు. ఎప్పుడైనా క్రింద పడచ్చు. ఏదైనా కచ్చితంగా చెప్పలేము. ఇక టాప్ హీరోలుగా ఎదుగుతున్న వారికి కూడా ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఎలా అంటే.. వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల వల్ల కూడా అయ్యి ఉండచ్చు. సరిగ్గా ఇదే కోవలోకి వస్తాడు అప్పటి హీరో హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

‘ప్రేమ ఖైదీ’ చిత్రం ఇతనికి పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చెయ్యగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటికే హరీష్ బాలీవుడ్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసాడు. ఇక హీరోగా నటించిన ‘ప్రేమ ఖైదీ’ చిత్రం హిట్ అవ్వడంతో అక్కడ కూడా స్టార్ హీరో అయిపోవాలని ట్రై చేసాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో సౌత్ లో అతన్ని చాలా వరకూ మరిచిపోయారు అనే చెప్పాలి. దాంతో అతను హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.

అయితే సెకండ్ హీరోగా అతనికి అవకాశాలు వచ్చాయి. నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ‘డాడీ డాడీ’, శోభన్ బాబు హీరోగా వచ్చిన ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఎస్.పి.పరశురామ్’, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గోకులంలో సీత’ వంటి చిత్రాల్లో నటించాడు హరీష్. ఇతని కెరీర్ మొత్తంలో 280సినిమాల్లో నటించాడు. ఇప్పుడు తన కొడుకుని కూడా నటుడుగా పరిచయం చెయ్యాలని.. తాను కూడా డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus