రాజ్ కుంద్రా చుట్టూ అనేక రకాల కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ వాతావరణాన్ని బట్టి చూస్తే అతనికి ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశం కూడా లేదని అనిపిస్తోంది. గతంలోనే పలు కేసుల్లో ఇరుక్కున్న రాజ్ కుంద్రాకు పోర్న్ విడియాల చిత్రీకరణ వలన పరిస్థితులు కఠినంగా మారాయి. మరో వారం పాటు సైబర్ క్రైమ్ పోలీసులు గ్యాప్ లేకుండా విచారించనున్నారు. ఇక బయటకు వస్తే అతను ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున అధికారులు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచెలా చర్యలు తీసుకున్నారు.
ఇక భర్త చేసిన తప్పులకు మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఇన్వెస్టిగేషన్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. రోజురోజుకు సైబర్ క్రైమ్ పోలీసులు సరికొత్త ఆధారాలను సేకరిస్తున్నారు. ఇటీవల శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా ఉంటున్న నివాసంలో రెండోసారి సోదాలు నిర్వహించారు.ఇంట్లోనే కీలక ఆధారాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు వాట్సాప్ చాటింగ్స్ లను కూడా పరిశీలించారు. వారి నివాసంలో భారీగా వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 122 సినిమాల నిర్మాణానికి గాను రూ.9 కోట్ల ఒప్పందం కుదిరిందట. ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోడల్స్ ను టార్గెట్ చేసి ఈ మాఫియాలోకి దింపినట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్ లిస్ట్‌ను పరిశీలించి మరికొందరిని కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.