Kareena Kapoor: కరీనాపై మండిపడుతోన్న నెటిజన్లు!

  • April 30, 2021 / 06:00 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రాతాల్లో కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. దేశం మొత్తం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం షికారు కోసం మాల్దీవులకు వెళ్లడంతో.. వారిపై విమర్శలను గుప్పిస్తున్నారు. బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్ కొద్దిరోజుల క్రితం మాల్దీవులకు వెళ్లారు. వీరే కాకుండా మరికొంతమంది సెలబ్రిటీలు కూడా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. శృతిహాసన్, నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై మండిపడ్డారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలంటూ కరీనా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.ఈ దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఉందో ఇంకా చాలా మందికి అర్ధం కావడం లేదని.. ఇంటి నుండి బయటకి వెళ్లే ముందు లేదా.. మీ గడ్డం కిందకు మాస్క్ ధరించినప్పుడు లేదా రూల్స్ అతిక్రమిస్తున్నప్పుడు ఒకసారి వైద్యులు, సిబ్బంది గురించి ఆలోచించాలని..

వాళ్లు మన కోసం శారీరకంగా, మానసికంగా శ్రమిస్తున్నారని… కాబట్టి ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కరీనా రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘ఈ నీతులు మీ వాళ్లకు చెప్పు.. వాళ్లు సిగ్గు లేకుండా వెకేషన్ లు ఎంజాయ్ చేస్తున్నారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ‘నీ కజిన్ రణబీర్ కపూర్ వారం రోజుల క్రితమే తన గర్ల్ ఫ్రెండ్ తో మాల్దీవులకు వెళ్లి వచ్చాడు. వాళ్లకు రూల్స్ వర్తించవా..?’ అంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు. మంచి మాటలు చెబుతామని పోస్ట్ పెట్టిన కరీనాకి రివర్స్ లో ట్రోలింగ్ ఎదురైంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus