Devara: ఆ హీరోని కాపీ కొట్టారు.. అంటున్న ప్రేక్షకులు!

  • May 22, 2023 / 01:52 PM IST

మీడియాలో ట్రోల్స్ కి ఎవరు అతిధులు కారని మరోసారి నిరూపితమైనది. కొత్త సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ , టీజర్ కానీ విడుదలైతే ఒక సినిమాతో ఇంకో సినిమాని పోల్చి ట్రోలింగ్స్ చెయ్యడం అనేది సోషల్ మీడియా లో సర్వసాధారణం అనే విషయం అందరికీ తెలిసిందే. నిన్న ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఆడియన్స్ నుండి మాత్రం రొటీన్ అని అనిపించింది.కొరటాల శివ సినిమా ప్రారంభం అప్పుడు ఇచ్చిన ఎలివేషన్స్ చూసి ఎన్టీఆర్ ఇందులో ఊర మాస్ అవతార్ లో కనిపిస్తాడు అనుకున్నారు. కానీ లుక్ మామూలుగా ఉండేలోపు ఆడియన్స్ కాస్త నిరాశకి గురి అయ్యారు. ఇక ఈ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లోని పరిచయ సన్నివేశం లో వచ్చే షాట్ కి పోలి ఉన్నట్టుగా మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్వీట్స్ వేశారు.

ఇలా పోల్చి చూస్తూ పాన్ ఇండియన్ సినిమాలు తీస్తూ కూడా కొత్తగా ఆలోచించకుండా, ఇలా కాపీ కొట్టాల్సిన అవసరం ఏమిటి అని కొరటాల శివ ని ట్యాగ్ చేసి వెక్కిరిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ చిత్రం లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకుల పాత్రలలో ఎన్టీఆర్ ఇందులో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించిన ఆంధ్ర వాలా మరియు శక్తి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

ఈ సినిమాకి (Devara) కూడా ఆ సెంటిమెంట్ ఎక్కడ పని చేస్తుందో అని భయపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల శివ ప్రస్తుతం ఫామ్ లేదు, ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ ఇచ్చాడు, ఫస్ట్ లుక్ చూస్తే మామూలుగా ఉంది, ఆయన చెప్పిన స్టోరీ లైన్ కూడా రొటీన్ గానే ఉంది, ఇక ఎలా తీస్తాడో ఏమిటో అని భయం మొదలైంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. మరి కొరటాల ఎన్టీఆర్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకుంటాడో లేదో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus