మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ.. గత ఏడాది ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేసి 2019 డిసెంబర్లోనే విడుదల చేస్తానని ప్రకటించాడు. అయితే ఏమైందో కానీ వర్మ చెప్పిన డేట్‌కి సినిమా విడుదల కాలేదు. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సినిమా కావడంతో ప్రక్షకుల్లో ఆశక్తినెలకొన్నా, ఈ తిక్క దర్శకుడు ఎప్పుడేం చేస్తాడో ఎవరికి తెలుసు.. ఎనౌన్స్ చేసి పక్కన పడేసిన ప్రాజెక్ట్స్ లిస్ట్‌లో ఈ సినిమా కూడా చేరిపోయందని అనుకున్నారు.
అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమాను తెరపైకి తెచ్చాడు ఆర్జీవి. లడ్కీ పేరుతో వరుసగా సాంగ్ టీజర్లను విడుదల చేసి మరోసారి టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అవుతున్నాడు. పూజా భలేకర్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న, బ్రూస్ లీ నుండి వచ్చి ఎంటర్ ది డ్రాగన్ సినిమా ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.
బ్రూస్ లీ వీర ఫ్యాన్స్‌లో ఒకడైన వర్మ, ఆయన స్ఫూర్తితో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపధ్యంలో బ్రూస్ లీని ఆరాధిస్తూ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది తనకు ఎదురైన అనేక సవాళ్ళను ఎదుర్కొన్ని ఎలా ఎదిగింది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. బ్రూస్ లీ లైఫ్ బేస్డ్ మూవీ అంటే ఏ మేకర్ అయినా మార్షల్ ఆర్ట్స్‌కు పెద్ద పీట వేస్తారు. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న జీవి ఎవరు ఆర్జీవి కదా, దీంతో మార్షల్ ఆర్ట్స్‌కు తనదైన స్టైట్లో గ్లామర్ అండ్ రొమాన్స్ జోడించేశాడు.
ఇక తాజాగా వార్మింగ్ ద వాటర్, టచ్ మీ నాట్ అంటూ సాంగ్ టీజర్లను విడుదల చేశాడు వర్మ. టాచ్ మీ నాట్ సాంగ్ టీజర్లో సముద్రపు ఒడ్డను పూజా అందాలతో కనువిందు చేశాడు. ఎర్రని బికినీతో పూజా తన ఒంపుసొంపులను చూపిస్తూ, అంగాంగ ప్రదర్శన చేసింది. అలాగే వార్మింగ్ ద వాటర్ సాంగ్ టీజర్లో అయితే సంధ్య వేళ ఒకవైపు సముద్రపు అలలతో పాటు ఆమె ఎర్రని బికినీ చాటున దాగి ఉన్న అందాలు కూడా ఉప్పొంగాయి. దీంతో ఈ రెండు టీజర్లు చూసిన జనాలు.. ఇదేం ఖర్మరా బాబు.. అయ్య బాబోయ్ ఇందే మార్షల్ ఆర్ట్స్ సినిమా.. కాలు ఎత్తడం దించడం తప్ప , అర్జీవీ ఏందయ్యా ఈ అరాచకం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.