Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్’ భయం పట్టుకుందా?
- July 27, 2026 / 03:28 PM ISTByFilmy Focus Desk
‘ఆదిపురుష్’ సినిమా గుర్తుందా? మామూలుగా అయితే రాముడి చరిత్ర మీద తీసిన సినిమా కాబట్టి కలకాలం రామచరితంగా ఈ సినిమా గుర్తుండేది. అయితే ఆ చరిత్రను విరచించే క్రమంలో కొన్ని వికృతమైన పనులు జరిగి ఆ సినిమా మరో రకంగా ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కి గుర్తుంది. ఆ సినిమాను చూసే చేశారో లేక వాళ్లకే వచ్చిన ఆలోచనో కానీ ‘రామాయణ’ సినిమా ట్రైలర్‌ను తొలుత కొంతమంది సన్నిహితులకు, మీడియా మిత్రులకు ప్రీమియర్ వేసి ప్రత్యేకంగా చూపించారు.
Ramayana
జులై 24న సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని ఘనంగా ప్రకటించారు కూడా. అయితే ఆ రోజు స్పెషల్ ప్రీమియర్ వేసినప్పుడు చూసినోళ్లు ఎవరూ బయటకు వచ్చి.. అందులో ఏముంది, ఎలా ఉంది అని మాట్లాడలేదు. ఒకట్రెండు మీడియా సంస్థలు అయితే అద్భుతం అని చెప్పాయి. ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ఈ సినిమాలో అని చెప్పారు. ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాను నిలబెట్టే సినిమా అంటూ గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ట్రైలర్‌ను అనుకున్న డేట్‌కి రిలీజ్ చేయలేదు. పోనీ రెడీ కాలేదా అంటే రీసెంట్‌గానే ప్రత్యేకంగా చూపించారు.

అంతే కాదు, ఈ ట్రైలర్ మన దేశంలో కాదు విదేశాల్లో ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. ప్రపంచ వేదికల మీద రిలీజ్ చేసినా, భారతదేశంలో రిలీజ్ చేసినా చూసేది యూట్యూబ్‌లోనే. కాబట్టి ఇక్కడ ఇంకేదో కారణముంది, అందుకే ట్రైలర్‌ని లేట్ చేశారు అనే మాట వినిపిస్తోంది. ఇటీవల ట్రైలర్ స్ట్రీమింగ్ సమయంలోనే దానిని పసిగట్టారు అని చెబుతున్నారు. నిజానికి అప్పట్లో ‘ఆదిపురుష్’ సినిమా ట్రైలర్ విషయంలో కూడా ఇలానే జరిగింది. అయితే అప్పుడు టీమ్ పసిగట్టలేక విడుదల చేసి నానా మాటలు పడింది.
అన్నట్లు.. అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని భావించి ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నాం. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ‘రామాయణ’ ప్రపంచ నలుమూలలకు వెళ్తుంది అని నిర్మాత నమిత్ మల్హోత్రా ట్వీట్ చేశారు. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్ 2026 వేడుకల్లో చిత్రబృందం పాల్గొంది. మరి అది అంతర్జాతీయ వేదికే కదా అక్కడ ఎందుకు చేయలేదో?













