ఆషూ రెడ్డిలా తయారైందంటూ సమంత లుక్స్ పై కామెంట్స్!

హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో సాఫీగా సాగాలంటే.. సక్సెస్, కాంటాకట్స్ తోపాటు లుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే.. హీరోయిన్స్ వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్స్ లో సగానికిపైగా జిమ్, బ్యూటీషన్స్ కు ధారబోస్తుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్స్ తో జనాలకు దర్శనమిచ్చి ఆహా అనిపించుకొంటారు. ఆ లుక్స్ బట్టే వారికి ఆఫర్స్ కూడా వస్తుంటాయి. మరి సమంత ఆ లుక్స్ విషయంలో ఏదైనా ప్రయోగం చేయాలనుకొందో లేక.. ఏదో లుక్ ట్రై చేయబోయి అది బెడిసికొట్టి అలా తయారైందో తెలియదు కానీ.. నిన్న ఓ ప్రయివేట్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సమంతను చూసి ఆల్మోస్ట్ అందరూ షాక్ తిన్నారు. ఏదో తేడా కొడుతుందే అని అందరూ అనుకొంటున్న తరుణంలో.. ఆమె కొన్ని ఫోటోస్ లో అచ్చు ఆషు రెడ్డిలా ఉండడం చూసి ఖంగుతిన్నారు.

నిజానికి.. ఆషు రెడ్డిని అందరూ జూనియర్ సమంత అనేవారు. ఆమె కూడా సమంతను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. కానీ.. నిన్న సమంత స్వయంగా ఆషూరెడ్డిలా కనిపించడం అనేది మాత్రం షాక్. బిగ్ బాస్ మూడో సీజన్ పుణ్యమా అని మంచి పాపులారిటీ సంపాదించుకొన్న ఆషూరెడ్డికి నిన్నటి ఇన్సిడెంట్ తర్వాత భీభత్సమైన పబ్లిసిటీ లభించింది.

1

2

3

4

5

6

7

8

9

10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus