‘మొగుడ్స్ పెళ్ళామ్స్’ షో ద్వారా పాపులర్ అయిన సురేఖ వాణి… తర్వాత వరుస సినిమాల్లో అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలు పోషించి బాగా పాపులర్ అయ్యింది. ఈమె కూతురు సుప్రీత కూడా చాలా ఫేమస్. అలా అని ఈమె నటి కాదు. కానీ సురేఖతో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ ఈమె బాగా పాపులర్ అయ్యింది. అలాగే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యని బాగా పెంచుకొంది. ఈమె ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని ఈమె ఫాలోవర్స్ ఎక్కువగా కామెంట్లు చేస్తూ ఉంటారు.
ఈమెకు సురేఖ యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా.. సుప్రీత ఇటీవల పబ్ కు వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమె బాగా చిల్ అయినట్టు ఆ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కొందరు పాజిటివ్ కామెంట్లు చేస్తుంటే ఇంకొందరు మాత్రం సుప్రీత చేసినంత ఎంజాయ్మెంట్ శ్రీరెడ్డి కూడా చేయడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సుప్రీత ఇలాంటి కామెంట్లు ఫేస్ చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఈమె తన తల్లితో కలిసి వైన్ తీసుకుంటూ తీసుకున్న ఫోటోలకు కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి. కానీ వాటిని పై సురేఖ కానీ సుప్రీత కానీ స్పందించింది లేదు. కానీ ఎప్పుడైనా హద్దులు మీరి కామెంట్ చేస్తే మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటారు.