రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ చేతులు మారిందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాకు 500 కోట్ల రూపాయలు ఖర్చు కాగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం.
ఆర్ఆర్ఆర్ హిందీ మినహా మిగతా ఏరియాల హక్కులను మేకర్స్ విక్రయించారని హిందీలో మాత్రం ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. హిందీలో ఈ సినిమాకు ఎంత వస్తే అంత మొత్తం నిర్మాతకు లాభంగా మిగులుతుందని సమాచారం. పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగినా వాళ్లు తప్పుకున్నారని తెలుస్తోంది. ఫిక్షన్ కథాంశంతో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కగా విపరీతమైన అంచనాలతో రిలీజవుతున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవాల్సి ఉంది.
భారీ మొత్తం ఖర్చు కావడంతో ఓవర్ ఫ్లోస్, హిందీ కలెక్షన్లను బట్టి నిర్మాతకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తే మాత్రమే నిర్మాతకు భారీ మొత్తంలో లాభాలు మిగులుతాయని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ ను గ్రాండ్ గా మొదలుపెట్టాలని మేకర్స్ అనుకుంటున్నారు. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ఇప్పటికైతే నిర్మాతకు ఆర్ఆర్ఆర్ మరీ ప్రాఫిటబుల్ వెంచర్ కాదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి త్వరలో మరో ట్రైలర్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి ఈ ట్రైలర్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!