NTR, Koratala: ఇండస్ట్రీ హిట్ సాధించేలా కొరటాల మూవీ స్క్రిప్ట్ ఉండనుందా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో నటించిన ప్రతి హీరోకు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది. అయితే ఆ స్టార్ హీరో తర్వాత సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది. ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నించి ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు ఫెయిలయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో ఈ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో తారక్ పాత్ర చేతికి ఆరు వేళ్లు ఉంటాయని తారక్ పాత్ర సీరియస్ అయిన సందర్భంలో ఆరో వేలు బిగుసుకుపోతుందని బోగట్టా. సినిమాలో పలు సందర్భాల్లో తారక్ పాత్ర ఆరో వేలుకు లింక్ ఉన్న సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది. తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫైనల్ అయ్యారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని బోగట్టా. సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా 2023 సెకండాఫ్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

జనతా గ్యారేజ్ తరహాలోనే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలని తారక్ కొరటాల శివ భావిస్తున్నారు. ఎన్టీఆర్30 మూవీలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ హిట్ సాధించేలా కొరటాల శివ స్క్రిప్ట్ ను సిద్ధం చేయడం గమనార్హం. ఈ సినిమాతో కొరటాల శివకు ఆచార్య చేదు జ్ఞాపకాలు కచ్చితంగా చెరిగిపోతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ తారక్ కు తెగ నచ్చేసిందని సమాచారం. తాజాగా హైదరాబాద్ లో యువసుధ ఆర్ట్స్ ఆఫీస్ ఓపెన్ కాగా మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూట్ పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించనున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus