Jr NTR: ఈసారైనా తారక్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాలలో జనతా గ్యారేజ్ ఒకటి. కేవలం ఆరు నెలలలో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటు తారక్, అటు కొరటాల శివ కెరీర్ లో మెమెరబుల్ మూవీగా నిలిచింది. తారక్ కొరటాల కాంబో మూవీకి సంబంధించిన ప్రకటన రాగానే జనతా గ్యారేజ్ ను మించిన మూవీ రాబోతుందని అభిమానులు భావించారు.

అయితే ఎన్టీఆర్30 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఏడాదికి పైగా సమయం పట్టింది. గత కొన్ని నెలలుగా కొరటాల శివ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ అధికారికంగా రావడం లేదు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాకు సంబంధించి కచ్చితంగా అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఈసారైనా తారక్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో తారక్ లేటెస్ట్ ఫోటోలు తెగ వైరల్ అవుతుండగా ఆ ఫోటోలలో తారక్ ఒకే లుక్ లో కనిపిస్తున్నారు.

తారక్30 లుక్ ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ ఈ సినిమాకు 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్, సుధాకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా కొరటాల శివ తారక్ ఫ్యాన్స్ అంచనాలను మించి మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.

తారక్ మాత్రం కొరటాల శివ మూవీతో నెగిటివ్ సెంటిమెంట్లను బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధించి ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus