Mahesh Babu, Sharukh Khan: మహేష్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ మూవీ అలా ఉండనుందా?

Ad not loaded.

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. గుంటూరు కారం, మహేష్ జక్కన్న కాంబో సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమాలతో పాటు మహేష్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్, బాలీవుడ్ సూపర్ స్టార్ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.

ఈ కాంబినేషన్ ను తెరపైకి చూడటానికి తమకు కూడా ఎంతో ఆసక్తి ఉందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఇండస్ట్రీ షేక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే మహేష్ సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని త్వరలో షారుఖ్ గెస్ట్ రోల్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ ప్రచారం నిజమైతే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. మహేష్ బాబు పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. షారుఖ్ పారితోషికం కూడా భారీ లెవెల్ లో ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ హీరోల కాంబినేషన్లలో సినిమాలను తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

రాబోయేరోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. మహేష్ బాబు షారుఖ్ ఖాన్ కాంబో సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు నిజం కావాలని ఆశిద్దాం. మహేశ్ ను (Mahesh Babu) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus