Mokshagna: ఆ మూవీలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ లో కనిపిస్తారా.. ఏమైందంటే?

  • May 2, 2023 / 04:36 PM IST

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని బాలయ్య పలు సందర్భాల్లో వెల్లడించిన నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే బాలయ్య బోయపాటి కాంబో మూవీలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో నటిస్తే మోక్షజ్ఞకు కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

అక్టోబర్ నెల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు సంబంధించి కూడా త్వరలో అదిరిపోయే అప్ డేట్స్ వస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశారని బోగట్టా.

మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ వేరే విధంగా బాలయ్య ప్లాన్ చేశారని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మోక్షజ్ఞ సినిమా కథ, కథనాలు ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞకు కథల విషయంలో, సినిమాల విషయంలో బాలయ్య సపోర్ట్ నూటికి నూరు శాతం ఉండనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ స్టార్ స్టేటస్ ను అందుకోవాలని అభిమానులు సైతం బలంగా కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

నందమూరి అభిమానుల సపోర్ట్ ఉన్న నేపథ్యంలో (Mokshagna) మోక్షజ్ఞ కెరీర్ పరంగా సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ సినిమాలకు సంబంధించి త్వరలో షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. అభిమానులను పూర్తిస్థాయిలో మెప్పించే సినిమాలో మోక్షజ్ఞ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నందమూరి హీరోలకు క్రేజ్ పెరుగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ లో మోక్షజ్ఞ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus