NTR30: ఎన్టీఆర్30 షూటింగ్ పై షాకింగ్ అప్ డేట్ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30 మూవీకి సంబంధించి ప్రతిరోజూ పదుల సంఖ్యలో గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్నా ఈ వార్తల గురించి ఎన్టీఆర్30 మేకర్స్ నుంచి కనీస స్పందన లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకడం లేదు. అయితే సైలెంట్ గానే ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన పనులు మొదలై వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఆఫీస్ మొదలైంది.

2023 సంక్రాంతి తర్వాత తారక్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు సొంతం చేసుకున్న మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాతో నిర్మాతగా కెరీర్ ను మొదలుపెట్టనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్30 సక్సెస్ సాధిస్తే కొరటాల శివ తర్వాత సినిమాలకు కూడా సుధాకర్ నిర్మాతగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది.

ఎన్టీఆర్30 పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్30 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అనిరుధ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

2023 దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఎన్టీఆర్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus