Shraddha Das: బాయ్ ఫ్రెండ్ తో శ్రద్ధాదాస్ రొమాన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్‌. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కలుపుకుని ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాల్లో నటించింది. కానీ స్టార్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం వెంటనే సెకండ్ హీరోయిన్ గా టర్న్ తీసుకోవడం ఈమెకు మైనస్ అయ్యింది అని చెప్పాలి.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవి కలిసి రాలేదు. ఈమె స్కిన్ షో విషయంలో కూడా రెచ్చిపోయినా, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఎగబడి నటించినా ఈమెకు కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. ఇటీవల ఈమె టీవీ షోలు, వెబ్ సిరీస్లలో ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది ఈ బ్యూటీ. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..

ఇప్పటి వరకు సింగిల్ గా గ్లామర్ షో చేసే ఫొటోలను మాత్రమే షేర్ చేస్తూ వచ్చిన (Shraddha Das) ఈమె సడెన్ గా మరో యువ నటుడి రొమాన్స్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఆ నటుడు మరెవరో కాదు.. అభితేష్ ద్వివేది. వీరిద్దరూ రొమాన్స్ చేస్తూ ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీరు ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు, లవర్స్ అంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. అందుకే ‘ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ’ ‘సూపర్ పెయిర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus