కన్నడంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రద్ధా శ్రీనాథ్.. తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి నటన కనపరిచిన ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రం తరువాత ఈమె బిజీ యాక్టర్ అయిపోతుంది అని అంతా అనుకుంటుంటే అలా జరగలేదు. తరువాత ఈమె ఆది సాయికుమార్ నటించిన ‘జోడి’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం ఫ్లాప్ అయ్యింది. అయితే ఇటీవల ఓటిటిలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
త్వరలో విశాల్ హీరోగా రానున్న ‘చక్ర’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా ఓటిటి లోనే విడుదలవుతుంది అని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల శ్రద్దా శ్రీనాథ్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పెళ్లైన తరువాత హీరోయిన్ల కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. త్వరలో శ్రద్ధా శ్రీనాథ్ ఫ్రెండ్ అయిన ఓ నటి పెళ్లి చేసుకోబోతుందట. అయితే ‘పెళ్లి తరువాత మీ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుందా? అందులోనూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కుదరదు కదా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ కామెంట్స్ కు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రద్ధా.
ఆమె మాట్లాడుతూ.. “పెళ్లి తరువాత నటించ కూడదా..? నటిస్తే తప్పేంటి? పెళ్లైతే హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోతుందా? పెళ్లైన హీరోయిన్లు రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి పనికి రారా..? పెళ్లైన హీరోయిన్ల పై అంత చిన్నచూపు ఎందుకు?” అంటూ తీవ్రంగా విరుచుకుపడింది శ్రద్దా. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఈమె కామెంట్స్ కు మద్దతు పలుకుతుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!