ఆఖరికి నాని మాట కూడా లెక్కచేయని ‘జెర్సీ’ భామ..!

Advertisement

ఇటీవల విడుదలైన ‘జెర్సీ’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, హీరో నానిలకు ఎంత పేరొచ్చిందో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. నిజంగానే ఈ చిత్రంలో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. బాధ్యత లేని భర్తను భరిస్తూ.. మరో పక్క బాధ్యతగల తల్లిగా ఈమె నటనకి ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టాల్సిందే. ఇక ఈ చిత్రంలో చాలా సంప్రదాయ పద్దతిగా కనిపించిన ఈ భామ.. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

ఇంకేముంది.. అసలే హీరోయిన్ల కొరతతో ఉన్న మన టాలీవుడ్ ఇండస్ట్రీకి శ్రద్దా శ్రీనాథ్ రూపంలో ప్రతిభ కలిగిన ఓ హీరోయిన్ దొరికిందని సంబరపడిపోయి ఈమెను సంప్రదించడం మొదలు పెట్టారట. ఈ లిస్ట్ లో మన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నాడట. నాగచైతన్య తో దిల్ రాజు రూపొందించబోయే ఓ చిత్రం కోసం శ్రద్దా శ్రీనాథ్ ను సంప్రదించాడట. అయితే ఈ చిత్రంలో నటించడానికి ఈమె భారీగా 75 లక్షల రెమ్యూనరేషన్ అడిగిందట. దీనికి దిల్ రాజు షాకయ్యాడట. టాలీవుడ్ మిడిల్ ఆర్డర్ హీరోయిన్లయిన రాశీ ఖన్నా, మెహ్రీన్, అనుపమ పరమేశ్వరన్, పాయల్ రాజ్ పుత్ లు 35 లక్షలకే ఓకే చెప్తుంటే శ్రద్దా శ్రీనాథ్ మాత్రం 70 అడిగే సరికి షాకయ్యాడట దిల్ రాజు. పోనీలే అని చెప్పి మరో 5 లక్షలు వేసి 40 లక్షలకి కన్వెన్స్ చేద్దామనుకున్నా ఆమె ఒప్పుకోలేదట. దీంతో నానిని రంగంలోకి దింపాడట రాజు గారు. అయితే నాని మాట మీద 50 లక్షలైతే ఓకే అందట. అలాకాదని నాని ఎంత నచ్చ చెప్పినా వినకుండా నో చెప్పి పంపించేసిందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus