వరుణ్ ధావన్ పెళ్లి పై వ్యంగ్యంగా స్పందించిన శ్రద్దా శ్రీనాథ్…!

ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నటాశా దలాల్ ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ముంబై అలిబాగ్ లోని రెస్టారెంట్ లో ఇతని పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు వరుణ్. ఈ క్రమంలో అతని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా విషెస్ చెప్పారు.ఈ క్రమంలో ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

‘మరో గ్రేట్ యాక్టర్ పెళ్లి చేసేసుకున్నాడు.బహుశా అతన్ని మళ్లీ స్క్రీన్ పై చూడాలేమేమో . ఇక్కడినుండి అతన్ని మిగిలిన హీరోయిన్లతో నటిస్తే అతని భార్య నటాషా, అత్తగారు ఒప్పుకోరేమో. దాంతో ఇక మీదట అతను మేల్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసుకోవాలేమో..! ఇక నుండీ పర్సనల్ లైఫ్ ను, వర్క్ లైఫ్ ను అతను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో..ఏదైమైనా మనం అతన్ని మిస్ అవుతున్నాం. వివాహ శుభాకాంక్షలు” అంటూ కామెంట్స్ చేసింది.

పలు ఇంటర్వ్యూలలో హీరోయిన్లను మీడియా అడిగే ప్రశ్నల గురించి ఇలా ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసింది మన జెర్సీ భామ. దాంతో ఈ కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు మాత్రం శుభమా అని అతను పెళ్లి చేసుకుంటే.. ఇలాంటి కామెంట్లు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజజీవితంలో కూడా శ్రద్ధా ఏ విషయం పై అయినా ఇలా ఘాటుగా స్పందిస్తుంటుంది శ్రద్దా శ్రీనాథ్.

1

2

3

4

 

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus