తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి శ్రేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ఇప్పటికీ పలు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. ఇకపోతే శ్రియ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. తన కూతురికి రాధా అని నామకరణం చేశారు.
తరచూ తన కూతురితో ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. శ్రేయ విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి విషయాన్ని కూడా రహస్యంగానే ఉంచారు. అయితే ఈమె బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా రహస్యంగా ఉంచి చాలా రోజుల తర్వాత తాను తల్లిని అయ్యాను అనే విషయాన్ని తెలియజేశారు ఈమె 2021 జనవరి 10వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన కొన్ని నెలలకు ఈమె ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు.
ఈమె ప్రెగ్నెంట్ అయిన సమయంలో కరోనా ఉన్న నేపథ్యంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు కానీ ఫోటోలు కానీ అభిమానులతో పంచుకోలేదు. అయితే ఆ అద్భుత క్షణాలను ఈమె కెమెరాలో బంధించారు. ఇక కూతురు పుట్టిందనే విషయం తెలియడంతో చాలామంది అసలు శ్రియ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది తనకే కూతురు జన్మించిందా లేక అడాప్ట్ చేసుకుందా అన్న సందేహాలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలో ఈమె తన ప్రేగ్నెన్సీ ఫోటోలను కూడా బయటపెట్టారు.
ఇలా తరచూ తన (Shriya Saran) కూతురితో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి క్షణాలను ఈమె కెమెరాలో బంధిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె ప్రెగ్నెంట్ అయిన క్షణం నుంచి తన కూతురు పుట్టిన క్షణాల నుంచి ఈ ఏడాది చివరి వరకు తన కూతురితో కలిపిన ఆనంద క్షణాలకు సంబంధించినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!