ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో అభిమాన హీరోయిన్ శ్రియ శరన్. ఈ భామకు యువతలో ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. అప్పట్లో హీరోలకు సమానంగా ఈవిడికి అభిమానులు ఉన్నారనేది అతిశయోక్తి ఏమి కాదు. ఆ రేంజ్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్న శ్రియ 2018 తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె కెరీర్ మంచి పీక్ స్టేజి లో ఉంది. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు, 2018 లో రష్యాకు చెందిన ఆండ్రి కొశ్చివ్ ను వివాహమాడింది శ్రియ. తరువాత 2020 లో కరోనా రావటం, అదే సమయంలో శ్రియ గర్భం దాల్చటం జరిగింది. అయితే గర్భధారణ సమయంలో తన యొక్క అనుభవాలను ఈ కింది విధంగా పంచుకుంది ఈ భామ.
కరోనా తరువాత శ్రియ తన పాపకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉండేది. అయితే చాలా మంది అభిమానులు అసలు శ్రియ ఎప్పుడు గర్భం దాల్చింది. ఎప్పుడు పాపకు జన్మనిచ్చింది అని సందేహాలు ఉండేవి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రియ మాట్లాడుతూ..” కరోనా సమయంలో తాను గర్భం దాల్చానని తెలిపింది. ఆ టైములో తన ఫీలింగ్స్ అసలు తన కంట్రోల్ ఉండేవి కాదని, ఎందుకు అంటే తన శరీరంలో చాల మార్పులు చోటుచేసుకున్నాయి అని, తనతో పాటు తన కడుపులో ఇంకో ప్రాణం ఊపిరి తీసుకుంటుంది అనే ఆలోచనే చాలా బాధ్యతగా అనిపించేది చెప్పింది. ఒక్కసారైనా బయటకు వెళ్లాలని అనిపించేది అని, అయితే ఆ సమయంలో భార్యల ఎమోషన్స్ ని సరిగా అర్ధం చేసుకుని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భర్త పై ఉందనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపింది. తన భర్త తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది.
కరోనా సమయంలో గర్భం దాల్చటంతో, పరిస్థితుల దృష్ట్యా శ్రియ మాత్రమే కాదు ప్రగ్నెసీతో ఉన్న ప్రతి ఒక్కరు హాస్పిటల్ కు బయటకు వెళ్లాలన్న ఇబ్బంది పడ్డారని, కానీ అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.