పవన్ హీరోయిన్ కన్ఫర్మ్ అయింది!

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్స్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. తమిళ నటి పార్వతి మీనన్ ను తీసుకోవాలని భావించారు. ఆ తరువాత రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది.

రకుల్ ఈ సినిమాలో నటిస్తే మెగాహీరోలందరిని కవర్ చేసినట్లుందని భావించారు. కానీ పవన్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కన్ఫర్మ్ చేస్తూ నిర్మాత శరత్ మరార్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆగస్ట్ నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పవన్, శృతి హాసన్ లది హిట్ పెయిర్. దీంతో ఈ సినిమా పై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus