Shruti Haasan: బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి.. అర్థం చేసుకున్నానంటూ?

  • May 25, 2024 / 12:49 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి హాసన్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉండగా కమల్ ఇంట్లో జరిగిన ఒక ఈవెంట్ కు శాంతను పంచెకట్టులో వచ్చి ఆకట్టుకోవడం గమనార్హం. శృతి హాసన్ శాంతనుతో విడిపోయి ఆరు నెలలు అయిందని సమాచారం అందుతోంది.

అయితే శాంతనుతో బ్రేకప్ గురించి తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి శృతి హాసన్ క్లారిటీ ఇచ్చారు. నాకు ఇలాంటి ప్రశ్నలు నచ్చవు కానీ చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నానని రిలేషన్ షిప్ కోసం ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి నా పనిలో నిమగ్నమై ఉన్నానని లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నానని శృతి హాసన్ వెల్లడించడం గమనార్హం. ఇదొక క్రేజీ ప్రయాణమని ఇందులో నా గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అదే సమయంలో ఇతరుల గురించి అర్థం చేసుకున్నానని శృతి పేర్కొన్నారు.

గతంలో శాంతనుతో దిగిన ఫోటోలను తరచూ పోస్ట్ చేసిన శృతి హాసన్ ఈ మధ్య కాలంలో ఎలాంటి ఫోటోలను షేర్ చేయకపోవడంతో బ్రేకప్ వార్తలు వైరల్ కాగా ఆ వార్తలే నిజమని తేలిపోయింది. సలార్2 (Salaar) సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా షూట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. శృతి హాసన్ ఇమేజ్ ను పెంచే సినిమాలలో మాత్రమే నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేని సినిమాలకు ఆమె దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్2 సినిమాకు సంబంధించి ప్రశాంత్ నీల్ స్పందించే వరకు క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే లేదని భోగట్టా. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను పెంచుకోగా కథనం విషయంలో ఈ దర్శకుడు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus