Shruti Haasan, Prabhas: ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్!

  • September 26, 2023 / 04:12 PM IST

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి శృతిహాసన్ ప్రస్తుతం హీరోయిన్గా కెరియర్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి బాలకృష్ణ నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈమె ప్రభాస్ నటించిన సలార్ సినిమా ద్వారా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం సలార్.

ఈ సినిమా ద్వారా శృతిహాసన్ (Shruti Haasan) పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రభాస్ సరసన కూడా నటించడం ఇది మొదటిసారి కావడంతో ఈ సినిమా కోసం తాను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఈమె తెలియజేశారు. తాజాగా హైదరాబాద్లో సందడి చేసినటువంటి శృతిహాసన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈమె సలార్ సినిమా గురించి మాత్రమే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ తో నటించడం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి కూడా వెల్లడించారు.

తాను సలార్ సినిమాని చూడడం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసిన నటించిన తనకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని తెలిపారు ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం తనది అంటూ తెలిపారు. అందరితోను సరదాగా మాట్లాడుతారు ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తారు అంటూ ఈమె తెలియజేశారు.

ప్రభాస్ ఒక్క సన్నివేశంలో చాలా లీనమైపోయి నటిస్తున్న సమయంలో మనం తప్పు చేస్తే కనుక ఆయన ఎప్పుడు సీరియస్ అవ్వలేదు పరవాలేదు మరొక టేక్ తీసుకుందాము అంటూ ఈయన మరొక టేక్ తీసుకోవడమే కాకుండా తోటి సెలబ్రిటీలను కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తారు అంటూ శృతిహాసన్ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus