Shruti Haasan: స్టార్ కిడ్ కాదు.. టాలెంట్ తో దూసుకెళ్తున్న శ్రుతి!

సెలబ్రిటీల వారసులుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం సులభమే అనుకుంటారు. కానీ ఆ పేరును వెనుకేసుకొని నెట్టుకురావడం కంటే, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం అసలు ఛాలెంజ్‌. ఈ విషయంలో శ్రుతిహాసన్‌ (Shruti Haasan) తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినా, తన కెరీర్‌ మీద మాత్రమే దృష్టి పెట్టింది. తండ్రి పేరు వినిపించకూడదనే జాగ్రత్తపడింది. సినీ ప్రయాణాన్ని పూర్తిగా స్వంతంగా ముందుకు తీసుకెళ్లాలనే నిశ్చయంతో ముందుకు సాగింది.

Shruti Haasan

కెరీర్‌ మొదట్లో శ్రుతికి (Shruti Haasan) అనుకున్నంత విజయాలు లభించలేదు. వరుసగా ఫ్లాపులతో కొంత నిరాశపడ్డా, వెనక్కి తగ్గలేదు. స్టార్‌ హీరోల సరసన వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా, కమర్షియల్‌ సక్సెస్‌ను కూడా చేజిక్కించుకుంది. ఇటీవలే వీరసింహారెడ్డి (Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), సలార్‌ పార్ట్‌ 1 (Salaar) వంటి బిగ్‌ బడ్జెట్‌ సినిమాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు సలార్ 2తో పాటు, కూలీలో (Coolie) రజనీకాంత్‌ (Rajinikanth) సరసన, ట్రైన్లో విజయ్‌ సేతుపతితో (Vijay Sethupathi) నటిస్తోంది. అంతేకాకుండా, తలపతి విజయ్‌ (Vijay Thalapathy) జననాయకన్ (Jana Nayagan) సినిమాలోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్‌ ఉంది.

శ్రుతి తండ్రి పేరు సహాయపడకుండా తనకంటూ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లింది. తన అసలు ఐడెంటిటీని చెప్పకుండా ఫేక్‌ పేరుతో కూడా స్నేహితులతో మెలిగిన రోజులు ఉన్నాయి. ‘నా పేరును అలా వినిపించుకుంటే, వాళ్లు నన్ను గౌరవిస్తారా లేక నా తండ్రి పేరును మాత్రమే గుర్తుపెట్టుకుంటారా?’ అనే భయంతో తండ్రి గొప్పతనాన్ని ఉపయోగించకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడింది. ఈ క్రమంలో శ్రుతి హాసన్‌ ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. ప్రేమ విషయంలో కూడా కొన్ని వైఫల్యాలను చవిచూసింది.

కానీ అవేమీ ఆమె ప్రయాణాన్ని ప్రభావితం చేయలేదు. నెమ్మదిగా గ్లామర్‌, టాలెంట్‌తో సమతూకంగా కెరీర్‌ను బలపరుచుకుంది. ముఖ్యంగా తన స్టైల్‌, స్ట్రాంగ్‌ పర్సనాలిటీతో ఆమె ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు శ్రుతిహాసన్‌ ఒక నటిగా మాత్రమే కాదు, ఓ ఇండిపెండెంట్‌ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూ ఆల్బమ్స్‌ చేస్తోంది. ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ మీద ఆసక్తి కనబరుస్తోంది. నటన, సంగీతం రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ తన స్థాయిని మరింత పెంచుకునేందుకు కృషి చేస్తోంది.

‘క్షణం’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus