Shruti Haasan: అలాంటివారు పక్కన ఉంటే ప్రమాదం.. వైరల్ అవుతున్న శృతి హాసన్ పోస్ట్!

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. కెరియర్ మొదట్లో ఈమె ఎన్నో సినిమాలలో నటించి వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నారు. ఇలా ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో చాలా మంది ఈమె కెరియర్ పై భారీ స్థాయిలో ట్రోల్ చేశారు. ఈ విధంగా ఈమె గురించి ఎన్నో రకాల విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా కెరియర్ పై ఫోకస్ చేసి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారని సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల్లో నుంచి ఈమె తనకు సంబంధించినటువంటి ఒక పెద్ద సీక్రెట్ అందరికీ తెలియజేయబోతున్నాను అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈమె చెప్పబోయే ఆ సీక్రెట్ ఏంటి అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

సీక్రెట్ నేను చెప్పకపోయినా దాగదని ఆ విషయం అందరికీ తెలుస్తుంది అంటూ ఈమె పోస్ట్ చేయడంతో బహుశా ఏదైనా కొత్త సినిమాకు కమిట్ అయ్యారా లేకపోతే ఈమె కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారా అంటూ చాలామంది వివిధ రకాలుగా సందేహాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి మరొక పోస్టు వైరల్ గా మారింది.

క్రియేటివ్ లేని వారి పక్కన క్రియేటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మనం ప్రమాదంలో పడినట్లే వాళ్ళు క్రియేటివ్ పీపుల్స్ ఆలోచనలు ఎప్పుడు కాజేయబడతాయో.వారు ఆ ఐడియాలు ఎప్పుడు కొట్టేస్తారో కూడా తెలీదు అన్నట్టుగా రాసుకొచ్చింది. ఇలా శృతిహాసన్ చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే కనుక ఈమె ఎవరి చేతిలోన దారుణంగా మోసపోయారు అందుకే ఇలాంటి పోస్ట్ చేశారనీ తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె (Shruti Haasan) ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus