Vakeel Saab: వకీల్ సాబ్ ట్రైలర్ లో శృతి మిస్ అయ్యారే..?

  • March 30, 2021 / 09:11 PM IST

పింక్ సినిమాకు రీమేక్ గా తెలుగులో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈ సినిమా వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. టీజర్ లో పవన్ కళ్యాణ్ హీరోయిజానికి ప్రాధాన్యత ఇచ్చిన మూవీ మేకర్స్ ట్రైలర్ లో మాత్రం కథకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. అయితే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ అస్సలు కనిపించలేదు.

వకీల్ సాబ్ ట్రైలర్ లో శృతికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరోయిన్ అయిన శృతిహాసన్ వకీల్ సాబ్ ట్రైలర్ లో లేకపోవడంతో తనను వకీల్ సాబ్ చిత్రయూనిట్ అవమానించిందని శృతిహాసన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుంటే చిత్రయూనిట్ శృతి రోల్ గురించి రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర కొంత సమయం మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి తగినట్లు వకీల్ సాబ్ స్క్రిప్ట్ లో మార్పులు జరగగా ఆ మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.

ఏప్రిల్ నెల 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు లాయర్ రోల్ లో నటించని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో లాయర్ పాత్రతో మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus