యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా హీరోల గురించి అంతా చెప్పుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే మొదటి పాన్ ఇండియా హీరో కమల్ హాసన్ అనే చెప్పాలి. ఆరోజుల్లోనే ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి .. అందులోనూ అన్ని భాషల్లోని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే కథలను, పాత్రలను ఆయన పోషించేవారు. బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టినా.. ఆయన తన ప్రయత్నాలు ఆపింది లేదు.
ఇప్పటికీ విభిన్న కథాంశంతో కూడుకున్న పాత్రలే చేస్తూ వస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రంలో విలన్ గా కూడా నటిస్తున్నారాయన. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. కమల్ హాసన్ సినిమాలతోనే కాకుండా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉండేవారు. మరీ ముఖ్యంగా కమల్ హాసన్ .. రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట డ్యాన్సర్ అయిన వాణి గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ పది సంవత్సరాలు కలిసి సంతోషంగా గడిపారు.వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అది పక్కన పెడితే.. కొన్ని కారణాల వల్ల 1988లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కమల్ తన సహ నటి సారికను ప్రేమించి 1988లోనే రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ శృతి హాసన్, అక్షర హాసన్ లు సంతానం.అయితే ఊహించని విధంగా రెండో భార్య సారికతో కూడా 2004లో విడాకులు తీసుకున్నాడు కమల్.
అటు తర్వాత హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశారు. తర్వాత ఆమెతో కూడా విడిపోయారు. ఇదిలా ఉండగా.. కమల్ – సారిక పెళ్ళికి ముందు సహజీవనం చేశారు. ఆ సమయంలోనే (Shruti Haasan) శృతి హాసన్ కి జన్మనివ్వడం జరిగింది. ఇక సారిక బాలీవుడ్లో కూడా బాగా రాణించిన సంగతి తెలిసిందే. ఆమె అప్పట్లో చాలా అందంగా ఉండేవారు. ఆమె వింటేజ్ పిక్స్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!