తనకు “గబ్బర్ సింగ్” సినిమాతో గోల్డెన్ లెగ్ ఇమేజ్ తీసుకురావడంతోపాటు.. కెరీర్ లోనే మొదటి మరియు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సరసన “కాటమరాయుడు” చిత్రంలో ఆఖరిసారిగా కనిపించిన గబ్బర్ బ్యూటీ శ్రుతిహాసన్ ఆ తర్వాత తండ్రి తెరకెక్కించే “శభాష్ నాయుడు” సినిమా సైన్ చేసింది. కమల్ హాసన్ కాలికి బలమైన గాయమవ్వడంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడం.. అప్పటికి ఆల్రెడీ సైన్ చేసిన “సంఘమిత్ర” ప్రొజెక్ట్ నుంచి శ్రుతి బయటకి వచ్చేయడం వంటి విషయాల కారణంగా శ్రుతి సినిమాల నుంచి బ్రేక్ తీసుకొంది. ఆ తర్వాత ఆమె సినిమాలు మానేసిందనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఆమె వద్దకి ఆఫర్లు కూడా రావడం తగ్గిపోయాయి. వచ్చిన కొన్ని కథలు ఆమెకి నచ్చకపోవడంతో శ్రుతి నటించిన సినిమా తెలుగు/తమిళ/హిందీ భాషల్లో విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తోంది.
ఈలోపు శ్రుతి ఎవరో ఫారిన్ కుర్రాడితో ప్రేమలో పడిందని, అతడ్ని పెళ్లి చేసుకొని సినిమాలకి నటిగా పూర్తిగా గుడ్ బై చెప్పేసి.. తనకు బాగా ఇష్టమైన సింగర్/మ్యూజీషియన్ గా కంటిన్యూ అవ్వాలనుకొంటుందని కథనాలు వెలువడ్డాయి. ఒకసారైతే ఏకంగా ఆమె పెళ్లి కూడా చేసేసుకొందని వార్త హల్ చల్ చేసింది. కట్ చేస్తే.. తను నా స్నేహితుడు మాత్రమే భర్త కాదంటూ నిన్న తన బోయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది శ్రుతిహాసన్. అమ్మడు ఇప్పటికైనా టూర్లు కాస్త తగ్గించి సినిమాల మీద దృష్టి సారిస్తే మంచిది.