శృతి హాసన్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యింది..

ఒక సినిమా హిట్టయితే నటీనటులలో ఎక్కువగా హీరోపైన ఎఫెక్ట్ పడవచ్చు. కానీ హీరోయిన్స్ పై కూడా కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇక కొందరికి ఐరెన్ లెగ్ ట్యాగ్ కూడా ఇస్తుంటారు. ఒకప్పుడు అలంటి నెగిటివ్ కామెంట్స్ ను దాటుకుంటూ వచ్చింది శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైనప్పటికి ఈ చెన్నై సుందరి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. అయితే ఆమెను ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు.

మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమా హిట్టవ్వడంతో ఓ వర్గం వారికి శృతి హాసన్ అదృష్ట దేవతగా మారిపోయింది. ఒకసారి పాత రికార్డులపై ఒక లుక్కేస్తే.. పవన్ కళ్యాణ్ తీన్ మార్, పులి, పంజా వంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆ తరువాత వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రం బిగ్గెస్ట్ హిట్. అందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. . ఇక మహేష్ బాబు నేనొక్కడినే, ఆగడు వంటి ప్లాపుల తరువాత దక్కిన విజయం శ్రీమంతుడు.

ఈ సినిమాలో మహేష్ తో శృతి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాస్ రాజా క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు అంటే శృతి హాసన్ కూడా అందుకు ముఖ్య కారణమని అంటూ.. అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోయిన్ సెంటిమెంట్ బాగానే వర్క్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి భవిష్యత్తులో ఆ లక్కు ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus