ఇప్పుడంటే వరుస సినిమాలు, విశేషమైన స్టార్ డమ్, భారీ భవంతులు, కార్లు వచ్చేసి స్టార్ హీరోయిన్లందరూ మన కంటికి దేవతల్లా కనిపిస్తున్నారు కానీ.. సినిమాల్లోకి రాకమునుపు వాళ్ళు కూడా మనలాగే సాధారణ జీవితాలు గడిపినవారే. వారికి సరదా సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. అలాగే శ్రుతిహాసన్ జీవితంలో కొన్ని సరదా సందర్భాలున్నాయట. ముఖ్యంగా కాలేజ్ డేస్ లో తన స్నేహితులందరూ కలిసి తనకో విచిత్రమైన ముద్దు పేరు పెట్టారట. శ్రుతి తన కాలేజ్ డేస్ లో చాలా విభిన్నంగా బిహేవ్ చేసేదట. అందరూ పాస్తాలు, నూడీల్స్ తింటుంటే శ్రుతిహాసన్ మాత్రం సింపుల్ గా సాంబార్ వండుకొని తినేదట. అందుకే అమ్మడిని తన స్నేహితులందరూ ముద్దుగా “మైలాపూర్ మామి” (మైలాపూర్ పిన్ని) అని పిలిచేవారట. ఈ విషయాన్ని శ్రుతి స్వయంగా వెల్లడించి కాసేపు ఆ పాత రోజుల్ని గుర్తు తెచ్చుకొని మురిసిపోయిందట.
అలాగే.. భవిష్యత్ లో తనకు కాబోయే భర్తకు కూడా ఇంట్లో సాంబార్ వడిపెడతానని, అతడు తన ఇష్టాలను గౌరవించేలా ఉంటే చాలని చెబుతోంది శ్రుతి. అమ్మడి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ ముచ్చటలు చెప్పడంతోపాటు త్వరలోనే ఒక తెలుగు సినిమా సైన్ చేస్తే ఆమె అభిమానులందరూ సంతోషిస్తారు.