కోవిడ్ కారణంగా .. గడిచిన 3 ఏళ్లలో చాలా మంది పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ లిస్ట్ చాలా పెద్దది. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా నిలిచింది.వివరాల్లోకి వెళితే.. నటి శుభ్ర అయ్యప్ప పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విశాల్ శివప్పను పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ఆరంభించింది శుభ్ర అయ్యప్ప.
ఇక గురువారం నాడు అంటే ఈరోజు వీరి వివాహం.. అతికొద్ది మంది… బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసి కొన్ని ఫోటోలను షేర్ చేసింది శుభ్ర. ఈ ఫోటోల్లో పట్టుచీరలో లక్షణంగా ముస్తాబయ్యింది. శుభ్ర పెళ్లి ఫోటోలు చూసిన కొంతమంది సెలబ్రిటీలు తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. సంయుక్త హెగ్డే, శాన్వి శ్రీవాత్సవ, ప్రణీత, మహత్ రాఘవేంద్ర వంటి సినీ సెలబ్రిటీలు నూతన దంపతులకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు.
ఇక నారా రోహిత్ హీరోగా 2014 లో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీలో ఈమె తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత ‘యవ్వనం ఒక ఫాంటసీ’ అనే మూవీలో కూడా నటించింది.అయితే హీరోయిన్ గా ఇక్కడ రాణించలేకపోయింది. అందుకే తమిళ, కన్నడ సినిమాల్లోనే నటిస్తూ వస్తోంది. అయితే పెళ్లయ్యాక ఈమె సినిమాల్లో నటిస్తుందో లేదో అనేది క్లారిటీ లేదు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. ఈమె పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?