నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. వీక్ డేస్ లో స్టడీగా రాణించిన ఈ చిత్రం న్యూ ఇయర్ హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్ల పరిస్థితి అంతగా బాగోలేకపోయినా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ నే రాబట్టింది.
ఒకసారి 10 రోజుల కలెక్షన్లని గమనిస్తే :
నైజాం | 9.00 cr |
సీడెడ్ | 2.45 cr |
ఉత్తరాంధ్ర | 2.10 cr |
ఈస్ట్ | 0.96 cr |
వెస్ట్ | 0.82 cr |
గుంటూరు | 1.17 cr |
కృష్ణా | 0.91 cr |
నెల్లూరు | 0.58 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.99 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.90 Cr |
ఓవర్సీస్ | 3.40 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 24.29 cr |
‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి అని ముందుగా ట్రేడ్ పండితులు చెప్పారు.అయితే ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూతపడటం జరిగింది. దాంతో మళ్ళీ బిజినెస్ లో అడ్జస్ట్ మెంట్ లు జరిగాయి. ఈ క్రమంలో రూ.22 కోట్లకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది.ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.24.29 కోట్ల షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.2.49 కోట్ల లాభాలను అందించింది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!