‘పోతారు.. మొత్తం పోతారు..’ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా? మొన్నీమధ్య ఓ సినిమాలో హీరో సిట్యువేషన్ గురించి చెప్పడానికి, తన టాలెంట్ గురించి చెప్పడానికి వాడాడు. ఇప్పుడు అదే డైలాగ్‌తో మరో కుర్ర హీరో.. స్టార్ హీరో సినిమాకు హైప్ ఇచ్చాడు. ‘అప్పటివరకూ మేం ఉంటామో పోతామో’ అని కామెంట్స్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. ఆయన చెప్పింది సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఆ కామెంట్స్‌ని రిపీట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఆఫ్‌లైన్ ఉన్న ఒకే ఒక్క ఫీవర్ ఫీవర్ ‘ఓజీ’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఓజీ’. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విసయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీమియర్ బెనిఫిట్ షోలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్లు రావడంతో ముందు రోజే సందడి చేయడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.
ఈ క్రమంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఓజీ’ సినిమా హైప్ మామూలుగా లేదని, మా హెల్త్ ఏం కావాలి అని రాసుకొచ్చారు. ‘ఓజీ’ హైప్ ఎఫెక్ట్ మా హెల్త్‌పై పడేలా ఉంది. సెప్టెంబర్ 25 వరకూ మేం ఉంటామో పోతామో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత మా పరిస్థితి ఏంటో? పవన్ కల్యాణ్ గారూ మీరు పవన్ కాదు, తుఫాన్ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
పవన్ కల్యాణ్ పాడిన పాట శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ‘ఓమి మై డియర్ ఓమి… ఎగిరెగిరి పడుతున్నావ్! నీలాంటి వాడిని నేలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు’ అంటూ ‘వాషి యో వాషి..’ హైకూను జపనీష్ భాషలో పవన్ పాడాడు. ఇక ఈ నెల 21న ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తారు.