Siddu Jonnalagadda: ఇంటిమేట్ సీన్లలో సిద్ధూ హాట్ పెర్ఫార్మన్స్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ ఆ తరువాత హీరోగా మారాడు. ‘గుంటూరు టాకీస్’ సినిమా నటుడిగా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత చాలా సినిమాలే చేశాడు. కానీ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు. లాక్ డౌన్ లో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాతో సిద్ధుకి ఓవర్ నైట్ గుర్తింపు వచ్చేసింది. మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ స్టార్ అనిపించుకున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో ‘నరుడి బతుకు నటన’ అనే సినిమా చేస్తున్నాడు. విమల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధు హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కొన్ని సీన్లయితే హద్దులు దాటి చిత్రీకరించారని అంటున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ డోస్ శృతిమించుతుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తరువాత ఈ తరహా సినిమాలు మరింత ఎక్కువగా వస్తున్నాయి.

ఇప్పుడు సిద్ధు సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు ‘అర్జున్ రెడ్డి’ని గుర్తు చేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో సిద్ధు రొమాంటిక్ హీరోగా ఫిక్స్ అయిపోతాడని అంటున్నారు. హీరోయిన్లను ఫ్లర్ట్ చేసే సీన్లు, ఆమెతో ఇంటిమేట్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయట. రషెష్ చూసిన వారంతా ఇక సిద్ధు యూత్ ఫుల్ జోనర్ కు ఐకాన్ గా మారిపోతాడని అంటున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus