ఈ మధ్య కాలంలో చిరు.. తన సినిమాల్లో యంగ్ హీరోలు ఉండేలా చూసుకుంటున్నారు. ‘ఆచార్య’ నుండి కూడా చిరు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. చిరు లెజెండరీ నటుడు, మెగాస్టార్ అని 90 లలో పుట్టిన వాళ్ళకే ఎక్కువ తెలుసు. కానీ ఆ తర్వాతి జెనరేషన్ కు పెద్దగా తెలీదు. సో వాళ్ళని ఆకర్షించి తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలి అంటే ఓ యంగ్ హీరో లేదా తనకు దగ్గరైన స్టార్ హీరో కావాలి.
అప్పుడే సినిమా పై బజ్ కూడా ఏర్పడుతుంది. ‘ఆచార్య’ లో చరణ్, ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్, ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ.. ఇప్పుడు ‘భోళా శంకర్’ లో కూడా సుశాంత్ నటిస్తున్నాడు. ఇలాగే చిరు నటించే తర్వాతి సినిమాల్లో కూడా యంగ్ హీరోలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ మధ్యనే కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథని చిరు ఓకే చేశారు. దీనికి స్క్రీన్ ప్లే బెజవాడ ప్రసన్న కుమార్ అందించనున్నాడు. నిర్మాత ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే ఈ కథలో ఓ యంగ్ హీరోకి ఛాన్స్ ఉందట. అందుకోసం డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డని సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇది పూర్తిగా వినోదాత్మకంగా సాగే కథ. (Chiranjeevi) చిరు కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇతను దాదాపు ఎస్ చెప్పే అవకాశాలు ఉన్నాయని వినికిడి.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా