సినీ ప్రపంచంలో అవకాశం రావడం అంత ఈజీ కాదు. ఛాన్స్ వచ్చినా మంచి పాత్రలు అందుకోవడం కూడా అదృష్టంతో కూడుకొని ఉంటుంది. సినిమానే ధ్యాసగా, శ్వాసగా కస్టపడి శ్రమిస్తే మంచి పొజిషన్ కి చేరుకోవచ్చని ఎంతమంది నిరూపించారు. ఆలా ఇప్పుడు మంచి స్టార్స్ గా గుర్తింపు తెచుకున్నవారు.. కెరీర్ తొలినాళ్లలో గుంపులో గోవిందు పాత్రల్లో కనిపించారు. మనం వారిని అప్పుడు గుర్తుపట్టలేము. ఇప్పుడు ఒక సారి ఆ చిత్రాలను చూస్తే అవాక్కవుతాం. అలా అతి చిన్న రోల్స్ చేసిన నటీనటులపై ఫోకస్..
రవితేజఅసిస్టెంట్ డైరక్టర్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టి మాస్ మహారాజ్ గా ఎదిగిన వ్యక్తి రవితేజ. ఈయన చిత్ర పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా వెండితెరపై కనిపించేవారు. కొన్నింటికి అసలు డైలాగులు కూడా ఉండవు. అయినా చేశారు. అటువంటి వాటిలో అల్లరి ప్రియుడు ఒకటి. ఇందులో రాజశేఖర్ గ్యాంగ్ లో ఒకడిగా చిన్న పాత్ర చేశారు.
సునీల్హాస్యనటుడిగా నవ్వించి హీరోగా మెప్పిస్తున్న నటుడు సునీల్. ఇతను తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వునేను సినిమా ద్వారా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికంటే ముందు సునీల్ ఓ సినిమాలో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి చిత్రంలో విద్యార్థుల గుంపులో ఒకరిగా కనిపిస్తారు.
నిఖిల్యువ హీరో నిఖిల్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా పాపులర్ అయ్యారు. ఈ చిత్రం కంటే ముందు నితిన్ సినిమా సంబరం లో ఓ కుర్రోడిగా కనిపిస్తారు. ఏంటి కనిపించలేదా? ఈసారి సంబరం సినిమాని చూడండి. మీరే గుర్తుపడతారు.
అనసూయజబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకోవడంతో పాటు సోగ్గాడే చిన్ని నాయన, క్షణం చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు. ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ నాగ చిత్రంలో విద్యార్థుల్లో ఒకరిగా నటించింది. అప్పుడు ఆమెకు ఒక క్లోజప్ షాట్ కూడా లేదు.
రష్మీబుల్లి తెర, వెండితెర అని తేడా లేకుండా అందాలు ఆరబోసి యువకులకు నిద్ర లేకుండా చేస్తున్న బ్యూటీ రష్మీ. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ఈమె ఉదయ్ కిరణ్ మూవీ హోలీలో హాస్యనటుడు సునీల్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది.
సాయి రామ్ శంకర్ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ 143 మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే అతని గురించి అందరికీ తెలిసింది. అంతకంటే ముందు అతను ఇడియట్ మూవీలో రవితేజ మిత్ర బృందంలో ఒకరిగా నటించారు.
మాధవీ లత“నచ్చావులే” చిత్రం తో మాధవీలత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కథానాయికగా కనిపించకముందు ఈమె హీరోయిన్ ఫ్రెండ్ రోల్ పోషించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధి మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా చిన్న రోల్ చేసింది.
విజయ్ దేవరకొండపెళ్లిచూపులు మూవీతో సక్సస్ ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంతకు ముందు చిన్న పాత్రలో వెండితెరపై కనిపించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు.
రావు రమేష్విలక్షణమైన డైలాగ్ డెలివిరీతో అదరగొడుతున్న రావు రమేష్ సినీ పయనం అతి చిన్న పాత్రతోనే మొదలయింది. గమ్యంలో చేసిన నక్సలైట్ పాత్రతో లైమ్ లైట్ లోకి వచ్చిన రావు గోపాల్ రావు తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ సీమ సింహం సినిమాలో సిమ్రాన్ కి తమ్ముడిగా నటించారు.
సిద్దార్ధ్లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్దార్ధ్ ఆర్టిస్ట్ గా మారక ముందు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలో అమృత సినిమాలో సాధారణమైన బస్సు ప్రయాణికుడిగా నటించారు. సినిమాలో అతను కొన్ని క్షణాలు మాత్రమే కనిపిస్తారు.
సంపూర్ణేష్ బాబుహృదయ కాలేయం అనే ఒక్క సినిమాతో బర్నింగ్ స్టార్ అయిపోయిన నటుడు సంపూర్ణేష్ బాబు. ఇతను కృష్ణవంశీ రూపొందించిన మహాత్మా చిత్రంలో రాజకీయ నాయకుడిగా నటించారు.