సినిమా వాళ్లు లావెక్కారు అంటే… అవకాశాలు కొండెక్కుతాయి అంటుంటారు. ఒకప్పుడు హీరో, హీరోయిన్లు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ… ఇప్పుడు మాత్రం చాలా కచ్చితంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉండటానికి జిమ్‌లు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఫిట్‌గా ఉంటున్నారు. కొందరు ఈ విషయాన్ని పక్కనపెట్టి లావెక్కి… మళ్లీ గుర్తించి ఫిట్ అవుతున్నారు. అలాంటి కథానాయకుల్లో తమిళ స్టార్ హీరో శింబు ఒకరు. ఇటీవల కాలంలో శింబును చూస్తే… కాస్త లావెక్కాడు.
కారణాలేంటో తెలియలేదు కానీ… బొద్దుగా మారాడు. అదే సమయంలో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు శింబును చూస్తే చాలా మారిపోయాడు. అసలు ఏమైంది, ఎందుకు అలా మారిపోయాడు తదితర వివరాలను శింబు చెప్పుకొచ్చారు. ఓ దశలో నా కెరీర్ ఇబ్బందుల్లో పడింది. మానసికంగా చాలా ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో బరువు పెరిగిపోయాను అని చెప్పారు శింబు. అయితే ఆ సమయంలో అభిమానులే తనకు అండగా నిలిచారు అని చెప్పారు శింబు.
వాళ్లు ఇచ్చిన స్ఫూర్తితోనే నేను తిరిగి పూర్వపు స్థితికి వచ్చాను. మానసికంగా, శారీరకంగా నన్ను నేను కొత్తగా మార్చుకోవాలని అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను అని చెప్పారు శింబు. నాన్‌వెజ్, ఆల్కహాల్‌ను పూర్తిగా మానేశాను. కఠిన కసరత్తులు ప్రారంభించి నన్ను నేను ఇలా ఫిట్‌గా మార్చుకున్నాను అని శింబు చెప్పారు. ఈ క్రమంలో దాదాపు 27కిలోల బరువు తగ్గానని ఆయన చెప్పారు.