తమిళనాట నడిగర్ సంఘ ఎన్నికలు రాజకీయ వేడిని తలపించాయి. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన శింబు, విశాల్ చేతిలో ఓటమి చెందాడు. నడిగర్ సంఘంలోని తన సభ్యత్వానికి శింబు రాజీనామా చేయనున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.
తాను బీప్ సాంగ్ వివాదంలో ఉన్నప్పుడూ నడిగర్ సంఘం నుంచి తనకు ఎటువంటి మద్దతు లభించకపోగా.. తన ప్రమేయం లేకుండా విడుదలైన బీప్ సాంగ్ పై క్షమాపణలు చెప్పమని విశాల్ కొరడాన్ని ఆయన తప్పుపట్టారు. అలా చేస్తే తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనని తెలిపిన శింబు.. ఈ సంఘం నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించుకోవాలని.. నడిగర్ సంఘం ఏ ఒక్కరిదీ కాదని రాధికా శరత్ కుమార్ తెలిపారు.