Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్
- September 1, 2026 / 01:31 PM ISTByPhani Kumar
ఏ కథ అయినా పేపర్ పై చాలా అందంగా ఉంటుంది. కానీ దానిని అదే విధంగా తెరకెక్కించడం సాధ్యమవుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఒక్కోసారి అది బెటర్ అవ్వొచ్చు. ఇంకొన్ని సార్లు మైనస్ అవ్వొచ్చు. ఈ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఉదాహరణకి ‘అతనొక్కడే’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలని తీసుకుందాం. ఇవి రెండూ ఆల్మోస్ట్ సేమ్ కథలు. కానీ ‘అతనొక్కడే’ స్క్రీన్ ప్లే క్రియేట్ చేసిన మ్యాజిక్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ క్రియేట్ చేయలేకపోయింది.
Akhil Akkineni

అలాగే చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ నే తీసుకోండి. ఆ సినిమా కథ ‘డాడీ’ నుండీ స్పూర్తినొందినదే అని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడినే ఒప్పుకున్నాడు. కానీ ‘డాడీ’ ఆ రేంజ్లో సక్సెస్ కాకపోవడానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ హిట్ అవ్వడానికి కారణం కూడా స్క్రీన్ ప్లేలో ఉన్న వ్యత్యాసం అనే చెప్పాలి. కథ ఎంత బాగున్నా.. దర్శకుడు తన స్క్రీన్ ప్లేతో వర్ణించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటేనే వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఆదరిస్తారు..!
దానికి ఇంకో లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ‘లెనిన్’ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా జూలైలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అఖిల్(Akhil Akkineni) కెరీర్ కి అవసరమైన మాస్ హిట్ ను అందించింది. అయితే ఈ సినిమా కథ పాతది అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. 2008 లో గోపిచంద్ హీరోగా ‘ఒంటరి’ అనే సినిమా వచ్చింది. ‘లెనిన్’ కథ ఆల్మోస్ట్ దానికి సిమిలర్ గా ఉంటుంది. ఆ సినిమాలో కూడా స్నేహితుడి కారణంగా హీరో.. హీరోయిన్ ను కోల్పోతాడు.
ఆ హీరోయిన్ చనిపోయే సీన్ కొంచెం బాలకృష్ణ ‘కృష్ణబాబు’ సినిమాకి దగ్గరగా ఉంటుంది అనుకోండి. అది వేరే విషయం. అయితే ‘ఒంటరి’ సినిమా స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేసింది. గ్యాప్ లేకుండా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మజా ఇవ్వకపోగా.. చిరాకు తెప్పించాయి. అయితే ‘లెనిన్’ విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే పక్కగా ఉంటుంది. ట్విస్టులు ఏవైతే ఉన్నాయో.. అవి ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ గా అనిపించాయి. అది మేటర్..!
















