Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్ రెడీ అవుతోంది ఎవరు?
- November 2, 2026 / 11:28 AM ISTByFilmy Focus Desk
అఖిల్‌కి హిట్ కావాలి.. అఖిల్‌కి హిట్ బొమ్మ పడాలి.. అఖిల్‌కి సరైన విజయం దక్కాలి.. ‘లెనిన్’ సినిమా విడుదలకు ముందు అంతా ఇలానే అనుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోకి వచ్చినా సరైన విజయం దక్కకపోవడంతో ఆ వైబ్ సినిమాకు బాగా పనికొచ్చింది. అనుకున్నట్లుగానే సినిమాకు మంచి టాక్ వచ్చింది, వసూళ్లు కూడా వచ్చాయి. ఎప్పటి నుండో అఖిల్ వెయిట్ చేస్తున్న విజయం వచ్చేసింది. అయితే ఆ సినిమా తర్వాత ఇంకా ఏ ప్రాజెక్టూ అనౌన్స్ చేయలేదు.
Akhil Akkineni
‘లెనిన్’ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా తనలో వచ్చిన మార్పు గురించి స్పష్టంగా చెప్పాడు. నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని కూడా చెప్పాడు. అయితే ఆ సినిమా వచ్చి నాలుగు నెలలు అయినా ఇంకా కొత్త సినిమా అనౌన్స్ కాలేదు. అఖిల్‌కి ఓ రచయిత కథ చెప్పారని కానీ, డైరక్టర్ కథ చెప్పారు అని కానీ ఎక్కడా లీకులు కూడా రావడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ జోరుగా జరుగుతోంది.
నిజానికి అక్కినేని హీరోల సినిమాల విషయంలో ఓ కాన్సెప్ట్ రన్ అవుతుంటుంది. అక్కినేని హీరోలకు ఎవరైనా కథ చెప్పినప్పుడు.. అది కాస్త ఓకే అనుకున్నా.. ఆ దర్శకుడు కొన్ని నెలల పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఉండి కథను తన టీమ్‌తో కలసి పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు. ఫైనల్ వెర్షన్ విని ఓకే అనుకుంటే సినిమా ముందుకెళ్తుంది. లేదంటే ఆ దర్శకుడు వేరే హీరోను చూసుకోవడమే. ఇప్పుడు అఖిల్ విషయంలోనూ అదే జరుగుతోందని టాక్.
అలా ఇద్దరు అగ్ర దర్శకులు, ఇద్దరు యువ దర్శకులు అన్నపూర్ణ స్టూడియోస్‌లో కథ విషయంలోనే కుస్తీలు పడుతున్నారట. ఈ విషయంలో క్లారిటీ వస్తే సినిమా అనౌన్స్మెంట్ వస్తుంది అని చెబుతున్నారు. ఏదేమైనా మోస్ట్ వెయిటింగ్ హిట్ వచ్చాక కూడా ఇలా నాలుగైదు నెలలు ఖాళీగా ఉండటం సరికాదు..













