కొన్నాళ్లుగా హిట్ సినిమాకి ఓ ఫార్ములా కామన్ గా నడుస్తుంది. అదే సినిమాలో దైవత్వం ఉంది.. ఒకటి,రెండు నిమిషాలు దేవుడు ప్రత్యక్షమైతే జనాలకు పూనకం వచ్చేస్తుంది. ఆ సినిమాని బ్లాక్ బస్టర్ ను చేసేస్తున్నారు. ‘హనుమాన్’ నుండి చూసుకుంటే ‘కల్కి 2898 ad’ రిషబ్ శెట్టి ‘కాంతార’, తేజ సజ్జ మరో సినిమా ‘మిరాయ్’ .. ఈ సినిమాలన్నిటిలో కామన్ పాయింట్ అదే. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఇదే ట్రెండ్ ను అనుసరిస్తూ వస్తున్న మరో సినిమా ‘అరి’. అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష వంటి వాళ్ళు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా దైవత్వం ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే దానికి తగ్గట్టు బలమైన ఎమోషన్స్ కి కూడా పెద్ద పీట వేశారట. క్లైమాక్స్ కచ్చితంగా మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ‘అరి’ ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఓ కీలక సన్నివేశంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమైనట్టు హింట్ ఇచ్చారు.దానికి సంబంధించిన విజువల్స్ కూడా క్వాలిటీగా ఉన్నట్టు ట్రైలర్ చెబుతుంది. ఇక ట్రైలర్ ను బట్టి.. ఆరు పాత్రలు, వారి నేపథ్యం, వారి లక్ష్యం.. ప్రధానంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. భాగవతంలో అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది.
టాలీవుడ్లో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని కాన్సెప్ట్ అది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ 7 ఏళ్లుగా పరిశోధన చేసి ఈ సినిమాను రూపొందించాడు. అలాగే బలమైన సందేశం కూడా ఇస్తారని తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు నేపథ్యంలో వచ్చిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :