హీరో విజయ్ దేవరకొండకు కారుకి యాక్సిడెంట్ అయ్యింది అనే వార్త.. కొన్ని గంటల నుండి తెగ వైరల్ అవుతుంది. దీంతో అతని అభిమానుల్లో కలవరం ఏర్పడింది. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండకి అలాగే అతని కార్లో ఉన్న వాళ్లకు ఎటువంటి గాయాలు కాలేదు. కారు మాత్రం స్వల్పంగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. తర్వాత విజయ్ తన స్నేహితుడి కారులో ఘటనా స్థలం నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక యాక్సిడెంట్ అయిన కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక విజయ్ దేవరకొండ ఇటీవల తన ప్రేయసి.. స్టార్ హీరోయిన్ అయినటువంటి రష్మిక మందనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అది నిజమే అని విజయ్ దేవరకొండ టీం సైతం స్పష్టం చేసింది. కానీ ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. ‘గీత గోవిందం’ సినిమా టైంలో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య పరిచయం ఏర్పడటం. అది స్నేహంగా మారి ప్రేమ, పెళ్లి వరకు వెళ్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది సో సోగా ఆడింది. మరోపక్క రష్మిక మందన ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.